

–సీనియర్ అడ్వకేట్ జీవి కృష్ణ మూర్తి.
ఉరవకొండ మన న్యూస్: రాయలసీమ అభివృద్ధికి సీమ ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు త్వరగా పెట్టిందేమీ లేదంటూ సీనియర్ అడ్వకేట్ జీవీ కృష్ణమూర్తి ఆరోపించారు.
శ్రీబాగ్ఒడంబడిక ప్రకారం రాయలసీమ కర్నూలు లో రాజధాని లేక పోగా ప్రధాన హైకోర్టు ఏర్పాటు లో ప్రజా ప్రతినిధులు ఘోరం గా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలుపరచాలని కోరుతూ కర్నూలు జిల్లా భారీ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టిందని గుర్తు చేశారు.
ఈ డిమాండ్ చాలా పిక్ ఉచ్చ స్థితిలో రాయలసీమ పాలక వర్గాలు భయ బ్రాంతులకు
గురియై కర్నూలు కు రావాలంటే
తమ పర్యటనలను కూడా వాయిదా వేసుకున్న పరిస్థితులుదాపురించగా. చివరకు ఆంధ్రా హైకోర్టు డిమాండ్ ను నిర్వీర్యపరిచి, దిగజారి స్థాయి తగ్గి, ఆంధ్రా హైకోర్టు బెంచ్ రాయలసీమ కర్నూలు కు చాలుఅనే స్థాయికి తెప్పించారని గుర్తు చేశారు. హైకోర్టు బెంచ్ కూడా మనం పోరాటం చేయనిదే మన రాయలసీమ ప్రాంత కర్నూలుకు రాదన్నది నగ్న సత్య మన్నారు..దీనికి పోరాటం తప్పు మార్గమే లేదని కృష్ణ మూర్తి పేర్కొన్నారు.రాయలసీమ
ప్రాంతం ప్రజల కంటే ఆంధ్రా కోస్తా
ప్రాంతం అన్ని రంగాలలో 100 సంవత్సరాలు అభివృద్ధిలో ఎక్కువ ముందంజలో గణనీయంగా ఉన్నదన్నారు.
చివరకు.రాయలసీమ ప్రాంత
ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలి పోతారని న్యాయవాది కృష్ణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి ప్రాంతం లోనే రాజధాని, ప్రధాన హైకోర్టు పెట్టడం సమంజసం కాదని దుయ్య బట్టారు.
సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు అభివృద్ధి గురించి ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు.
ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు గుర్తించి సీమ ప్రాంతా అభివృద్ధికి కృషి చేయాలని న్యాయవాది కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.