

మన న్యూస్ ,నిజాంసాగర్,(జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని, ఆయన బిసి వర్గానికి చెందిన వ్యక్తిగా తాను ఆధారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని జుకల్ బారసా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే వెల్లడించారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం లోబడి తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని. ఈ విషయంలో తోట లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు, బీసీ వర్గానికి చెందిన వాడని తాను ఎన్నిక పిటిషన్ వేయడం జరిగిందని. న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని హనుమాన్ షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో జీవితంలో ఎప్పుడు కూడా రాజీ పడేది ప్రసక్తే లేదని కరాకండిగా తేల్చి చెప్పారు. ఇటీవల తాను, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత్రావుతో రాజీ పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని హనుమాన్ షిండే ఖండించారు. తాను 15 ఏళ్ల కాలం పాటు జూకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశానని ఎక్కడైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఉంటే రుజువు చేస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటారు అని భార స మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే వెల్లడించారు. తన జీవితం తెల్ల కాగితం లాంటిదని ఎప్పుడు ఎవరైనా తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే తలవంచుతానని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. ఎక్కడి నుంచో వచ్చి జూకల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంత్రావుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయానికి కష్టపడితే. ప్రస్తుతం వారిపై తిరుగుబాటు చేస్తున్నారని హనుమాన్ సిండే ఆరోపించారు . తోట లక్ష్మీకాంత్ రావు ఏడాది పాలనలో జూకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని హనుమాన్ షిండే వెల్లడించారు. విజయానికి కృషి చేసిన వారిపై వారి సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నారు అంటూ హనుమాన్ షిండే వెల్లడించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వడానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఈ విషయంపై జూకల్ నియోజకవర్గం చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఎమ్మెల్యే లక్ష్మీకాంతవు కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాలని. లక్ష్మీకాంతరావు అవినీతిని అక్రమాలకు కాంగ్రెస్ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని హనుమాన్ షిండే గుర్తు చేశారు. మంచి నాయకున్ని ఓడించి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ గెలిపించినందుకు జూకల్ నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే పేర్కొన్నారు. ఎప్పటికీ తాను జూకర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని, ఎవరు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలంటూ బారసా నాయకులకు , కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించారు