

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ధరణీ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందించి దుశ్శాలువతో సత్కరించారు. బంగారుపాళ్యం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భాస్కర్ నాయుడు కలెక్టర్ని మొదటి సారి కలిసిన సందర్భంలో ఎమ్మెల్యే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై చర్చించారు. బంగారుపాళ్యం మార్కెట్ కు జిల్లా పరిపాలన నుండి పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సిందిగా కలెక్టర్ ను కోరారు. దీనిపై సానుకూలంగా కలెక్టర్ స్పందిస్తూ రైతుల సంక్షేమం కోసం మార్కెట్ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.