

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిగా లెవెల్‌తో, రెండు వైపులా వాల్ టు వాల్ నిర్మించబడుతున్నాయి. రోడ్లపై నీరు నిలవకుండా తగిన రీతిలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులకు సూచించాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాం. పనుల్లో నిర్లక్ష్యం గానీ, నాణ్యత లోపం గానీ కనుగొనబడితే తగిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వెంకటేష్, అశోక్, అరుప్, సుధాకర్, అన్ను, సంతోష్, విజయ్ బీజేపీ నాయకులు వంశీ యాదవ్, టీంకు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.