వచ్చే నెల 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలి.- మంత్రి నిమ్మల రామానాయుడు..

మన న్యూస్,తిరుపతి :
తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో శుక్రవారం సుపరిపాలనలో ఏడాదిపాలన కార్యక్రమాన్ని చింతలచెను నాలుగో డివిజన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రైతన్నల సంక్షేమం కోసం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, వచ్చే నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల హామీల అమలు నెరవేర్చడంతోపాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరి విరియడమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబుల సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టిస్తోందని చెప్పారు. ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవనన్నారు. ఎన్టీఆర్ భరోసా, 4000 రూపాయలకు పెన్షన్ పెంపు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాల అమలుపై ప్రజలకు వివరించాలన్నారు. మరో నాలుగేళ్లలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ గా అభివృద్ధి చెందబోతోందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు దంపురి భాస్కర్ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు, డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్.పి శ్రీనివాసులు, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్
ఆర్. ముని రామయ్య, కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..