

గొల్లప్రోలు జూలై 25 మన న్యూస్ : గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు నియమితులయ్యారు. మండల పరిధిలో మూడు సొసైటీలు ఉండగా గొల్లప్రోలు, చేబ్రోలు సొసైటీలు టిడిపికి, చెందుర్తి సొసైటీ జనసేనకు కేటాయిస్తూ ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావును సొసైటీ అధ్యక్షునిగా నామినేట్ చేసారు. త్రిసభ్య కమిటీలో మిగిలిన ఇద్దరిని జనసేన పార్టీ నుండి నామినేట్ చేయనున్నారు. సొసైటీ అధ్యక్షునిగా నియమితులైన సుబ్బారావును నగర పంచాయతీ మాజీ చైర్ పర్సన్ శీరం మాణిక్యం, ఏలేరు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కడారి బాబ్జి, పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు. కాగా గొల్లప్రోలుసొసైటీ అధ్యక్ష పదవి టిడిపికి దక్కేలా కృషి చేసిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ వి ఎస్ ఎన్ వర్మను సొసైటీ అధ్యక్షునిగా నియమితులైన సుబ్బారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.