

ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండ పట్టణంలో ఏడు దేవస్థానాలలో చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలను గురువారం భక్తులు పోటాపోటీగా జరుపుకున్నారు.
కాగా ఉరవకొండ పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కాలనీలోని దేవస్థానం, గురుగుంట్ల చౌడేశ్వరి, పురమానుకట్ట చౌడేశ్వరి, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానాలలో జయంతి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
స్థానిక పదో వార్డు లోని చౌడేశ్వరి కాలనీలోని చౌడేశ్వరి దేవస్థానంలో
ఉదయం 7 గంటలకు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు నవగ్రహారాధన9 గంటలకు అమ్మవారికి గంగా జలాభిషేకం, పంచామృతాభిషేకాలు,10 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తికి సామూహిక క్షీరాభిషేకం, చౌడేశ్వరి దేవికి బోనాల సమర్పణ,10-50 గంటలకు మహా మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం 12 గంటలకు అన్నదానం,7 గంటలకు ఉయ్యాల సేవ.జరిగింది. అనంతరం దేవస్థానంలో భక్తులు అన్నదానం నిర్వహించారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతం : ఆగస్టు 8వ తేదీన శ్రావణ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు దేవస్థానంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు చందా రాము తెలిపారు.,
ఇది ఇలా ఉండగా గట్టు వీధిలోని చౌడేశ్వరి దేవస్థానం, పురమానుకట్ట చౌడేశ్వరి ఆలయం, గురుగుంట్ల అమ్మవారి దేవస్థానం, పురగాద్రి చౌడేశ్వరి మాత, కొండప్ప భావి వీధిలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం, వేరే వారి గుంపు నిర్వహించే చౌడేశ్వరి దేవస్థానాలు మొత్తం ఏడు దేవస్థానాలలో అమ్మవారు భక్తుల పూజలు అందుకున్నారు.
సాయంత్రం అమ్మవారు పల్లకిలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. అమ్మవారిని భక్తులు ఖడ్గమాలతో స్తుతిస్తూ పురవీధుల గుండా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని భక్తులు భావించారు. భక్తులు నారికేలాలు సమర్పించి జయంతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.