

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో శాంతి థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభసందర్భంగా జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు శ్రీ ఐయినాబత్తిన రాజేష్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమం, కేక్ కటింగ్, బాణాసంచాలతో జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా హరిహర వీరమల్లు కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది, థియేటర్ వద్దకు వచ్చే ప్రజలకు అభిమానులకు జనసేన పార్టీ నాయకులు అన్ని సౌకర్యాలు కల్పించారు, థియేటర్ వద్ద పరిస్థితులను పరిశీలించారు, ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు, ఈ సినిమా చక్కటి ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసైనికులు అందరూ సంబరాలు చేయడం జరిగింది అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఐయినాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, యలమందల మాల్యాద్రి, కాసుల శ్రీనివాస్, అనుమలశెట్టి కిరణ్, గుంటుపల్లి శ్రీను, తగరం రాజు, పోలిశెట్టి విజయకుమార్, ఎస్.కె మాభాష, భాను, దేవినేని బాలాజీ జనసైనికులు అభిమానులు పాల్గొన్నారు.