

గొల్లప్రోలు జూలై మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం.. దుర్గాడ గ్రామం. ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజున ఆషాడ మాసం, మాస శివరాత్రి ,ఆరుద్ర నక్షత్రం, బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు.. మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ ..ఏకాదశ ద్రవ్య మహా రుద్రాభిషేకం నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో శాకంబరేశ్వర స్వామిగా రామలింగేశ్వర స్వామి అలంకరణ చేసి సప్త హారతులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.. ఆలయ సేవా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గ్రామంలో లభించిన పండిన కూరగాయలతో ఈ అలంకరణలు చేస్తామని తెలియజేశారు.