

మన న్యూస్ సింగరాయకొండ:-
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో చైర్మన్, విశ్రాంత ఉపాధ్యాయిని గుంటకు రామలక్ష్మమ్మ ఆర్థిక సహకారంతో బుధవారం సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలో ఫకీర్ పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్సిల్లు మరియు ఆడపిల్లలకు అవసరమైన రిబ్బన్లు, క్లిప్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ చైర్మన్ గుంటక రామలక్ష్మమ్మ మాట్లాడుతూ ఈ 2025 26 విద్యా సంవత్సరంలో 8 ప్రభుత్వ పాఠశాలలకు అందజేతకు తీర్మానించుకుందామని దీంట్లో భాగంగానే బుధవారం కార్యక్రమం నిర్వహించామన్నారు.
పేదవారిని ఉన్నత స్థానంలో నిలబెట్టుటకు కేవలం సత్ప్రవర్తనతో కూడిన విద్యార్థన వలనే సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని బాగా చదువుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.బాల్యంలో చిన్నారులకు బహుమతులు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు తల్లిదండ్రులు సహకరిస్తారని, అదేవిధంగా పిల్లల విద్యాభివృద్ధికి విభిన్న విద్యా బోధనతో తమ వంతు కృషి చేస్తామన్నారు.కార్యక్రమానికి కోటపాటి నారాయణ అధ్యక్షత వహించగా మానవతా సభ్యులు మహంకాళి నరసింహారావు,జె.వి సుబ్బారావు,ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు, లక్ష్మి ప్రసన్న విద్య కమిటీ చైర్మన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
