

- శంఖవరం మండల వ్యవసాయ అధికారి అధికారి పి గాంధి
శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా దార మల్లాపురం,శృంగదార గ్రామాల్లో రైతులకు వరి నారుమళ్లు యాజమాన్యంపై ముందస్తు అవగాహన కల్పించడం జరిగింది .ప్రస్తుతం నారుమళ్లు సుమారు 10రోజుల వయస్సులో ఉన్నందున కలుపు నివారణ చేపట్టాలని సూచించారు. ప్రత్తి లో కలుపు తీశాక ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచించారు.ద్రవరూప ఎరువులైన నానో యూరియా,నానో డి ఏ పి వాడకంపై అవగాహన కల్పించారు.చిరు ధాన్యాల సాగు ప్రాముఖ్యత,ప్రకృతి వ్యవసాయ విధానాలు గూర్చి ఆత్మ బి టి ఎం బి బాబురావు వివరించారు.అనంతరం రైతులతో ప్రత్తి,వరి నారుమల్లను పరిశీలించి సూచనలు ఇచ్చారు.ఉద్యాన సహాయకులు ప్రసాద్,సువర్ణరాజు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ,రైతులు, మహిళలు పాల్గొన్నారు.