

మన న్యూస్ తవణంపల్లె జులై-22: మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ఎండోమెంట్ కమిషనర్ వెంగంపల్లెలోని పురాతన సీతారాముల ఆలయాన్ని పరిశీలించి అంచనాలు వేసి రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు. దేవదాయశాఖ మంత్రి అనుమతితో ఎండోమెంట్ కమిషనర్ సీజీఎఫ్(కన్జర్వేషన్ గ్రాంట్ ఫండ్స్)స్కీం కింద ఆగమశాస్త్రం ప్రకారం నూతన సీతారాముల దేవస్థానం నిర్మించడానికి రూ.88 లక్షలు మంజూరు చేసింది. గ్రామస్తుల కాంట్రిబ్యూషన్ కింద రూ.22 లక్షలు నిధులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు రూ.22 లక్షలు నిధులు విరాళాలు చెల్లించడానికి ముందుకు వచ్చారు. వెంగపల్లెలో పురాతన ఆలయస్థానంలో నూతన గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎండోమెంట్ అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
