ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేయాలి. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్

మన న్యూస్: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఎయిర్బస్సు డ్రైవర్లు కు లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తున్న సర్కులర్లు ప్రకారం జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ ,పీఎఫ్, సెలవులు వంటి కార్మిక చట్టాలని అమలు చేయాలని, ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నదని, రాష్ట్ర కార్యదర్శి వి తులసి రామ్, జిల్లా నాయకులు వి చంద్రయ్య తెలిపారు. మన్యం జిల్లా పర్యటనలో భాగంగా సాలూరు డిపో వద్ద జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీసీలో కార్మిక చట్టాలు అమలు చేసి సర్కులర్ ప్రకారం స్కిల్డ్ వర్కర్లకు 11900 ,సెమీ స్కిల్డ్,వర్కర్లకు 14058 రూపాయలు, డ్రైవర్లకు 17266 రూపాయలు ఈఎస్ఐ, పిఎఫ్ ,వారాంతపు సెలవులు, లేబర్ హాలిడేస్ తదితర హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై నవంబర్ ఏడున లేబర్ ఆఫీస్ లో జరిగిన జాయింట్ మీటింగ్ లో చర్చలు జరిగాయని, చట్టప్రకారం కార్మికులందరికీ ఆర్టీసీ లోజీవోలను అమలు చేయడం లేదని తెలిపారు.
మరల డిసెంబర్ 4న అక్కయ్యపాలెం లో ఉన్న లేబర్ ఆఫీస్ నందు జరుగుతున్న సమావేశానికి అన్ని డిపోల నుంచి కార్మికుల పెద్ద ఎత్తున తరలిరావాలని, డిమాండ్ సాధించుకునే వరకు ఐక్యంగా పోరాడేందుకు సిద్ధపడాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ తరుడు పార్టీ పేరుతో ఆర్టీసీ లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు సహకరించాలని ,లేకపోతే పెద్ద ఎత్తున పోరాడేందుకు వెనుకాడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మిక సంఘం నాయకులు r. శంకర్ ,వి సీతారాం, వి ప్రభు, ఎల్ రమేష్, బి సురేష్ ,సభాష్టియన్, జి కుమార్ ,తేజ ,ఖాన్, పోలా రావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///