

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఇటివల కాలంలో అనారోగ్యంతో కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే ముందు తన స్వగ్రామమైన కిర్లంపూడి నివాసానికి చేరుకోవడంతో ముద్రగడ పద్మనాభం ను మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, జనసేన పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, కాపు జేసి నాయకులు ఆకుల రామకృష్ణ ముద్రగడను పరామర్శించి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ వీరాఘవరావు (బాలు )ను తోట నరసింహం, వంగా గీత, ఆకుల రామకృష్ణ పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.