

- మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తానని మాజీ మంత్రి వైసిపి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ మెరుగైన వైద్య చికత్స కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముద్రగడ పద్మనాభం అన్నారు. గత నాలుగు రోజుల కిందటి నుండి కాకినాడలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం తో మెరుగైన వైద్యం అందించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ ముద్రగడ తనయుడు గిరిబాబుతో ఫోన్లో మాట్లాడడంతో సోమవారం ఉదయం బయలుదేరి ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ వెళ్లారు. ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ వెళ్లే ముందు కాకినాడ నుండి తన స్వగ్రామమైన కిర్లంపూడి గ్రామానికి వచ్చి కొంతసేపు కుటుంబ సభ్యులతో గడిపి అనంతరం నాయకులను కార్యకర్తలను అభిమానులను పలకరించారు. ముద్రగడ పద్మనాభం ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారనే విషయం తెలియడంతో ఉమ్మిడి తూర్పు గోదావరి జిల్లాల వైసీపీ నాయుకులు, కార్యకర్తలు అభిమానులు కిర్లంపూడి కి చేరుకుని మ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ని చూసి అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని కార్యకర్తల నాయకులు అభిమానులు భగవంతుణ్ణి ప్రార్థించారు.