

పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు ఇసుకను సరిహద్దు ప్రాంతాల్లో 50 లోడ్ల ఇసుకను డంపింగ్ చేసుకొని రాత్రి వేళల్లో తమిళనాడుకు టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.. పాలసముద్రం మండలానికి చెందిన బడా నాయకుడు అక్రమాలకు అడ్డుకునే అధికారులు ఆ బడా నాయకుడితో కుమ్మక్కయ్యారా అని మండలంలో చర్చించుకుంటున్నారు ఇలా అక్రమ ఇసుక రవాణాతో లక్షలాది రూపాయలు సోమ్ముచేసుకుంటున్నారని పాలసముద్రం మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.. ఇలాగే అక్రమ ఇసుక తమిళనాడుకు తరలిస్తే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పాలసముద్రం మండల ప్రజలు ఆరోపించారు.. ఇకనైనా పాలసముద్రం మండల అధికారులు స్పందించి ఆ టిడిపి బడా నాయకుడి ఇసుక అక్రమాన్ని అడ్డుకోవాలని స్థానికులు తెలిపారు.