మాజీ ఎమ్మెల్యే చిట్టెం తీరు మార్చుకో.

మన న్యూస్ నర్వ మండలం :- నిన్న నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ అద్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు, బీసం చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి అబివృద్ధి చేయకుండా పనిచేసే మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు.
గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి నర్వ మండలానికి మీరు చేసినటువంటి అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వం18 నెలల్లో మేము చేసిన అభివృద్ధి గురించి నర్వ అంబేద్కర్ చౌరస్తా దగ్గర చర్చ చేయడానికి తేది మీరు చెప్పండి,బహిరంగ చర్చ చేయడానికి రావాలని సవాల్ విసిరుతున్నాం
మంత్రి వాకిటి శ్రీ హరి సర్పంచ్ అయిన రోజు మీరు మెకానిక్ షెడ్ లో పనిచేసేవారు మర్చిపోయారా,నాడు సర్పంచ్ నుంచి నేడు మంత్రి స్థాయికి ఎదిగిన మచ్చలేని నాయకుడు వాకిటి శ్రీహరి మీ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి చనిపోయిన తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కొందరు వ్యక్తుల్లో ముందున్న వ్యక్తి శ్రీహరి,ఒకరకంగా మీకు రాజకీయ బిక్ష పెట్టిందే వాకిటి శ్రీహరి అన్నగారు అది మర్చిపోకండి అన్నారు.నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ అంతర్గత పొత్తును నిన్న రాయికోడు గ్రామంలో జరిగిన సమావేశం లో బిజెపి పార్టీ అధికార ప్రతినిధి లాగా,DK అరుణమ్మ ఏజెంట్ గా రామ్మోహన్ రెడ్డి మాట్లాడడం,వారి అనైతిక పొత్తును బహిరంగపరిచినట్లు అయింది అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నర్వ మండలానికి మీరు చేసిన అభివృద్ధి సిసి రోడ్ల గురించి ఏ గ్రామంలో ఎన్ని సిసి రోడ్లు వేయించారు చూయిస్తారా, ఆనాడు మీరు రోడ్లు వేసి ఉంటే ఈరోజు గ్రామాల్లో మీరు వేసిన రోడ్లు ఎక్కడికి పోయాయి, రోడ్లు వేయకుండానే కమిషన్లు దండుకున్నారా అని అనుమానం వస్తుంది.
*గత 10 సంవత్సరాలలో నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ తీసుకురాని దుర్మార్గపు పరిపాలన మీద అయితే, నేడు ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నది మంత్రి వాకిటి శ్రీహరి పరిపాలన,సభ్య సమాజం తలదించుకునే విధంగా మగతనం గురించి మాజీ ఎమ్మెల్యే సతీమణి మాట్లాడడం సిగ్గుమాలిన చర్యగా చూస్తున్నాం.
గత పదేండ్లు కమిషన్లు దండుకున్న మీరు పని చేసే మంత్రి గారిపై మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.మాజీ ఎంపిటిసి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.మండల ఉపాధ్యక్షుడు శరణప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన, మంత్రిగారి పైన నిన్న మీరు మాట్లాడిన తీరు హస్యాపదం, ఒక బలహీన వర్గాలకు చెందిన వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి వచ్చినందుకు జీర్ణించుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు ద్వారా ప్రజానాయకుడు వాకిటి శ్రీహరి గారు సర్పంచ్ నుంచి మంత్రి స్థాయి దాకా ఎదిగారు. మీరు రాచరికపు మాటలు ఇకపై మాట్లాడితే తీవ్రమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోలీస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు D. కృష్ణారెడ్డి బోల్బండ వెంకటేష్, మండల నాయకులు మాదిరెడ్డి రవీందర్ రెడ్డి,రాజారెడ్డి,సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపిటిసి సుధాకర్ రెడ్డి, కల్వల జగదీశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్,జబ్బర్,నెట్టెంపాడు వెంకటయ్య,నరేశ్,లంకాల మహేశ్, నర్వ గ్రామ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి,వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///