

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పిఎసిఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ గా పిల్లల సింహాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్, సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పార్టీ యూత్ ప్రెసిడెంట్ చల్లా కనకరావు ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ చైర్మన్గా సింహాచలం ను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా జి శ్రీనివాసరావు, కోలా అప్పారావులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సింహాచలం స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రైతులకు అందుబాటులో ఉంటానని అన్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు పలువురు పూలదండలతో దుస్సాలువతో సన్మానించారు. మండల నాయకులంతా ఆయనకు అభినందనలు తెలియజేశారు. టీ డి పి ఇంటింట ప్రచారం:- సుపరిపాలన లో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా మోసూరు గ్రామంలో పార్టీ అధ్యక్షులు జి యుగంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు, అభిమానులు అంతా కలిసి ఏడాదిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంటింట ప్రచారం చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ మతల బలరాము, మండల పార్టీ ఉపాధ్యక్షులు పోలినాయుడు, మండల పార్టీ యూత్ అధ్యక్షులు చల్లా కనక రావు, మోసూరు త్రీ మెన్ కమిటీ చైర్మన్ సింహాచలం, పాచిపెంట ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు, టిడిపి నాయకులు మాదిరెడ్డి మజ్జరావు,కొరిపల్లి సురేష్ శివ, సీతారాం తదితరులు హాజరయ్యారు.