

మన న్యూస్ సాలూరు జూలై 20:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో బంగారం కాలనీలో 14, 15 వార్డులను సందర్శించిన మాజీమంత్రి రాజన్నదొరకు అక్కడ ప్రజలు నిరాజనాలు పలికారు. ఆదివారం సాయంత్రం 14, 15వ వార్డులలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజన్నదొర పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఏవిధంగా మోసం చేశారో కరపత్రాల ద్వారా ఆ అవార్డుల ప్రజలకు తెలియజేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గెలిచిన ప్రతిసారి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మధు, రాంబాయి, కొగ్గూరు లక్ష్మణరావు, 22 వ వార్డు కౌన్సిలర్ గిరి రఘు, కాకి రంగా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.