

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన బండి వరలక్ష్మి అనే పేద విద్యార్థిని పై చదువుల నిమిత్తం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసులు నాయుడు,కో పౌండర్ శ్రీమతి శిరీషమ్మ దాతృత్వంతో 50వేల రూపాయలను ట్రస్టు అధ్యక్షులు రాజనేని పిచ్చయ్య నాయుడు చేతుల మీదుగా అందజేశారు. వరలక్ష్మి తిక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులతో స్కూల్ ఫస్ట్ రాగ, పై చదువులు చదివించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో నిస్వార్థంతో ఎన్నో ఏళ్లుగా ఎల్లవేళలా ఎంతో మంది నిరుపేదలకు విద్యా,వైద్యం అందిస్తున్న రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ను విద్యార్థిని తండ్రి బండి హరి సంప్రదించారు.వెంటనే స్పందించిన ట్రస్టు నిర్వాహకులు వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత కార్యదర్శి రామయ్య నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, దాసినేని శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.