


మన న్యూస్,నిజాంసాగర్🙁 జుక్కల్ ) మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాల కళాశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పాఠశాల, కళాశాలలో విద్యాభ్యాసం చేసి విద్యార్థినీలు తలపైన బోనాలు ఎత్తుకొని పాఠశాల ఆవరణలో ఊరేగించారు.బోనాల పండుగ ఆవశ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు వివిధ దేవత రూపంలో పోతరాజు వేషాలతో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్ర మంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ కె.సంధ్య,వైస్ ప్రిన్సిపాల్ సాయి
బాబు,సహా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.మహమ్మద్ నగర్: మండలంలోని మంజీర మోడల్ స్కూల్ లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.చిన్నారులు పోతరాజుల వేషధారణలో నృత్యం చేస్తు బోనమెత్తి డీజే పాటలతో చిందులేశారు. పాఠశాల ప్రిన్సి పల్ కీర్తి,రమా, ఉపాధ్యాయులు వాసవి, సుమిత్ర,అశ్వీని తదితరులు పాల్గొన్నారు.

