


మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిసీతక్కను శనివారం హైదరాబాద్ లోజుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ కన్వీనర్ అరవింద్,ఓబీసీ కన్వీనర్ రామలింగం,మర్యాదపూర్వకం గా కలసి పూలమాల శాలువాతో ఘనంగా మంత్రిని సత్కరించారు.జుక్కల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరినట్లు అరవింద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ కాంగ్రెస్ నాయకులు విఠల్ పటేల్, బిచ్కుంద మాజీ జెడ్పిటిసి కమల్ కిషోర్,మాజీ ఎంపీటీసీ అవర్ సురేష్,నిజాంసాగర్ మాజీ జడ్పీటిసి జయ ప్రదీప్, మైనారిటీ నాయకులు పాషా సెట్,జుక్కల్ మండల అధ్యక్షులు సంజు పటేల్, వినోద్ పటేల్, పుల్లెల విట్టల్ తదితరులు ఉన్నారు.