

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్లవారి పాలెం, మండల పరిష,త్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ నడుం బిగించింది. పాఠశాల ఆట స్థలంలో పెరిగియున్న జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లల మానసిక ఉల్లాసానికి, శారీరక అభివృద్ధికి తోడ్పడే ఆట స్థలాన్ని ప్రధానోపాధ్యాయులవినతి మేరకు గ్రామపార్టీ అధ్యక్షులు సవిడిబోయిన మురళి దగ్గరుండి జెసిబి సహాయంతో బాగు చేయించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పరిచారు. ఈ సందర్భంగా సవిడి బోయిన మురళి మాట్లాడుతూ ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ డే మీటింగ్ సందర్భంగా ఉపాధ్యాయులు మెగా PTM యొక్క ఉద్దేశాన్ని చక్కగా వివరించారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా స్ఫూర్తి పొంది మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు దామచర్ల సత్య గార్ల నాయకత్వంలో గ్రామంలోని విద్యాభివృద్ధికి స్థానిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరిచామని, మంచినీటి వసతి, టాయిలెట్లు మొదలైనవి బాగు చేయించి మొక్కలు పెంపకానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతున్నామని, అంతేకాకుండా పాఠశాలకు అవసరమైన వసతులు కూడా కల్పించేందుకు గ్రామ కమిటీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ మురళి గారు అడిగిన వెంటనే పాఠశాల అభివృద్ధికి తన సొంత నిధులతో ముందుకు వచ్చారని, ఇలాంటి దాతలు ఉంటే పాఠశాలలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతాయని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ చౌదరి,అంగన్వాడీ కార్యకర్త రజిని,యువ నాయకులు పిగిలి శివ, భాస్కర్, రాజు, రామారావు, దాసరి వేణు, చిమటా సాయి,గవదగట్ల రమణయ్య పాల్గొన్నారు.
