ప్రజల మద్దతుతోనే రిలే నిరాహార దీక్ష…

  • న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం..
  • మైనింగు రవాణాకు ప్రత్యేక రోడ్డు వేసుకోవాల్సిందే..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- గ్రామ ప్రజల మద్దతుతోనే రిలే నిరాహార దీక్షకు సిద్ధమని సామాజిక ఉద్యమనేత, సేవా కార్యకర్త మేకల కృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామ సిబ్బంది వీది రామాలయం వద్ద అల్లూరి సీతారామరాజు దీక్షా శిబిరం నుండి సామాజిక సేవా కార్యకర్త మేకల కృష్ణ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జులై 21 ఉదయం నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తానని తెలియజేశారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై పరిమితికి మించిన బరువుతో నిర్లక్ష్యంగా, అక్రమంగా నిత్యం ప్రమాద భరితంగా రవాణా చేస్తున్న ప్రైవేటు సంస్థల వందలాది లారీల మాఫియా ఆగడాలను నియంత్రించని ప్రభుత్వ యంత్రాంగాల విధానాల మార్పు కోరుతూ ఈ జూలై 21 నుండి రిలే నిరాహారదీక్ష చేపట్ట నున్నట్టు శంఖవరం గ్రామ సామాజిక సేవాకర్త, మేకల కృష్ణ ప్రకటించారు. 21 నుండి 24 తేది వరకు ఉదయం 9, సాయంత్రం 4 గంటల మధ్య రిలే నిరాహార దీక్ష చేయడానికి సిబ్బంది విధి రామాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తన ఉద్యమ పూర్తి వివరాలను వెల్లడించారు. 21వ తేది సోమవారం ఉదయం 9 గంటలకు శంఖవరం సిబ్బంది వీధి రామాలయం వద్ద తన రిలే నిరహార దీక్షను ప్రారంభించి 24 తేది సాయంత్రం 4 గంటల వరకూ తన రిలే నిరాహారదీక్షలను కొనసాగించ నున్నట్లు ఆయన వెల్లడించారు.‌ అప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకపోతే 25 తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మేకల కృష్ణ ప్రకటించారు. గ్రామ ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఉద్యమం మరింత బలపడేందుకు గ్రామ ప్రజలను నుండి సమన్యాయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో గల అన్ని వర్గాల ప్రజల మద్దతుతోనే ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు.ఆదివారం గ్రామంలో గల రామాలయాలలో క్రైస్తవ మందిరాలలో మద్దతు కొరకు ప్రచారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజారవాణా రొడ్డు{ఆర్ అండ్ బి}రోడ్డు పై నుండి అధిక బరువులు కల్గిన క్వారీలారీలు ఆక్రమ రవాణాకు నిరసన ప్రజా రవాణా {ఆర్ అండ్ బి}రొడ్డు పై ప్రయాణం కొనసాగిస్తూన్నా ద్విచక్ర వాహనాలదారులు,అటో,ఎడ్లబండులు వారికి క్వారీలారీల డ్రైవర్లుకు మాస్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో శంఖవరం గ్రామ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు జట్లా లక్ష్మణరావు,దాసరి బాబురావు, బొమ్మిడి చిట్టిబాబు,బోర్రా సత్యనారాయణ{పాలకేంద్రం},రేలంగి పెదవెంకన్న,దేవరపు సుబ్రహ్మణ్యం{బుజ్జి},గవరసాని నాని,బొమ్మిడి సత్యనారాయణ,రేలంగి నాగేశ్వరరావు{నాగయ్య}గారు,పిల్లా సత్యనారాయణ,అడపా వెంకటేశ్వరరావు, బిరుదుల బాబురావు, పెనుపోతుల చక్రరావు,రేలంగి యేసుబాబు,కుర్రే మాణిక్యం,కొన అర్జునరావు, పేకేటి నారాయణరావు,గండ్రేటి చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..