

- వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరిబాబు
- శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-కూటమి పరిపాలనకి ఏడాది గడిచిన అభివృద్ధి శూన్యమని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల విస్తృత స్థాయి సమావేశం ఏలేశ్వరం లారీ యూనియన్ కళ్యాణ మండపం లో మండల కన్వీనర్ గొల్లపల్లి సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. సమావేశంలో ముద్రగడ గిరిబాబు బాబు ష్యూరిటీ గ్యారెంటీ మోసం క్యూఆర్ కోడ్ ను వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో గిరిబాబు ఆవిష్కరించారు. గిరిబాబు మాట్లాడుతూ,ఏడాది పాలనలో ఓటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకే అలివిమాలిన హామీలిచ్చి కూటమి ప్రభుత్వం ఏడాదిలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక కత్తిరిస్తామని సీఎం స్థాయిలో చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. రూ 1.75 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో అర్థం కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు, యిజనగిరి ప్రసాద్, ఒలేటి చంటిబాబు, గుమ్ములూరి వెంకటరమణ, గూనిపూడి కొండబాబు, తదితరులు పాల్గొన్నారు