

మన న్యూస్ ఐరాల జులై-18
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినాయనిపల్లె దళితవాడలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును, కస్తూరినాయనిపల్లెలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డును, కుల్లంపల్లె మరియు కుల్లంపల్లె దళితవాడల్లో కలిపి రూ.6 లక్షల విలువైన సీసీ రోడ్లను, కామినాయనిపల్లెలో మరో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును, అలాగే వైయస్ గేటు నుండి పుత్రమద్ది వయా కామినాయనిపల్లె వరకు రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన బిటుమిన్ (బీటీ) రోడ్డును మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మౌళిక వసతులు చేరవేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కో- ఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, నాయకులు మేదర్లమిట్ట మోహన్ నాయుడు, దేవాజీ, చంద్రశేఖర్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గోన్నారు.
