

మన న్యూస్ (పూతలపట్టు నియోజకవర్గం) ప్రతినిధి జులై-18
చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తల్లి గారైన పులివర్తి లక్ష్మీ భారతీ మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం పాకాల మండలం, పులివర్తివారిపల్లె గ్రామంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న మురళీమోహన్, లక్ష్మీ భారతీ పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ముఖ్యంగా పులివర్తి నానిని ఓదార్చి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ…
“పులివర్తి నానికి మాతృవియోగం కలగడం చాలా బాధాకరం, లక్ష్మీ భారతీ మృతి వారి కుటుంబానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, ఐరాల క్లస్టర్ ఇంఛార్జ్ మేదరమిట్ల మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.