తల్లికి వందనంకి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు తల్లులు ఖాతాలో జమ చేసిన విద్యాశాఖ శాఖ మాత్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం:బలపరిచిన ఎమ్మెల్సీ…

గూడూరు, మన న్యూస్ :– వెంకటగిరి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయాలన్నీ త్వరగా పూర్తి చేయాలి:ఎమ్మెల్సీ…* వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయానికి అదనంగా 50 లక్షలు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్సీ,మంజూరు చేసిన మంత్రివర్యులు ఆనం…*
చిలకూరు మండలం,పారిచర్ల వారి పాలెం పాఠశాలలో త్రాగునీటి సమస్య తెలియజేసిన ఎమ్మెల్సీ,జడ్పీ నిధులు మంజూరు చేసిన జడ్పీ చైర్పర్సన్… చిల్లకూరు మండలం పునపరివారి పాలెం రోడ్డుకు అంచనాలు తయారు చేసి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్కు పంపాలని అధికారులను కోరిన ఎమ్మెల్సీ. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గతంలో 2022-23,202-24 సంవత్సరంలో వెంకటగిరి శాసనసభ్యులుగా ఉండి ఎంతో కృషితో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో వెంకటగిరి,డక్కిలి,సైదాపురం,బాలాయపల్లి మండల పరిషత్ ఒక్కో కార్యాలయానీకి 1.60 కోట్ల రూపాయలు అంచనాలతో మంజూరు చేయించడం జరిగింది.వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం పనులు మాత్రమే పూర్తి కాబడినవని,మిగిలిన డక్కిలి,సైదాపురం,బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయాలు పనులు ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్సీ సంబంధిత అధికారులను అడిగారు…* అలాగే వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయానికి 1.60 కోట్ల రూపాయలు మంజూరు చేసిన,తరువాత అదనంగా 50 లక్షల రూపాయలు ఖర్చు అయినదని,దానికి సంబంధించిన నిధులను మంజూరు చేయవలసిందిగా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మని అడిగిన ఎమ్మెల్సీ .దీనికి బదులుగా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జిల్లా పరిషత్ నిధులు నుంచి ఇవ్వలేమని,వీలు కాదని తెలిపారు.దీనికి వెంటనే స్పందించిన మంత్రి జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారికి జిల్లా పరిషత్ నిధులు నుంచి 50 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయవలసిందిగా ఆదేశించారు.దీనితో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ఎమ్మెల్సీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు…తల్లికి వందనం పథకానికి సంబంధించి 10 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ కి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్సీ ,అలాగే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రతిపాదించిన తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి తల్లుల ఖాతాలలో 15 వేల రూపాయలు జమ కావడంతో,ధన్యవాదములు తెలుపుతూ జిల్లా పరిషత్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ బలపరిచారు… గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పునపరివారి పాలెం రోడ్డు గురించి పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగిన ఎమ్మెల్సీ ,ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ రావడం జరిగిందని,కాబట్టి త్వరతగతిన ఎస్టిమేషన్ పూర్తి చేసి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ కు పంపాల్సిందిగా అధికారులకు తెలియజేసిన ఎమ్మెల్సీ ,ఈ రోడ్డు వల్ల ఆరు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కి తెలిపిన ఎమ్మెల్సీ…మెగా పేరెంట్ టీచర్-మీటింగ్ సందర్భంగా తాను చిలకూరు మండలంలోని పారిచర్లవారిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలుకి వెళ్లడం జరిగిందని,అక్కడ పిల్లలకు త్రాగునీటి వసతి లేదని,రోజు వాళ్లు వాటర్ క్యాన్లు తెచ్చుకొని,ఆ నీటిని తాగుతున్నారని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.విద్యాశాఖ అధికారులు,జడ్పీటీసీలు మరియు ఎంపీపీలు వారి వారి పరిధిలోని పాఠశాలలను తరచుగా సందర్శిస్తే వారికి అక్కడ సమస్యలు తెలుస్తాయని ఎమ్మెల్సీ తెలిపారు.వెంటనే స్పందించిన జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పారిచర్లవారిపాలెం గ్రామంలోని పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ కు జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయడం జరిగింది.అందుకు గాను ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు…ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ,నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ ,ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు,జడ్పీటీసీలు,మండల పరిషత్ అధ్యక్షులు,నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ,గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ,జిల్లా పరిషత్ ఇంచార్జ్ ముఖ్యకార్యనిర్వహణాధికారి జె.మోహనరావు ,ఉమ్మడి నెల్లూరు జిల్లాల వివిధ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు…*

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..