

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మె లోనికి వెళ్లి శుక్రవారానికి అరవ రోజుకు చేరుకుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా దీర్ఘకాలికంగా పరిష్కాకారానికి నోచుకోని పలు సమస్యలపై సమ్మె బాట పట్టి మూడు రోజుల కు చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ.. జి.ఓ.36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు, గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు సంబంధించిన జి.ఓ.లు వెంటనే ఇవ్వాలని. మున్సిపల్ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని, ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, రిటైర్మెంట్ చేసిన, అనారోగ్యంతో బాధపడుతున్న, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ “ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేసేంతవరకు పోరాటాన్ని ఆపేది లేదంటూ కార్మికులు శిబిరంలో పెద్ద ఎత్తున వినాదాలు చేయడం జరిగింది”. వర్షాన్ని సైతం కూడా లెక్కచేయకుండా నిరసన కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య, మున్సిపల్ కార్మిక సంఘం కమిటీ సభ్యులు గూడూరు మణి,అల్లం శాంతి వర్ధన్,గుర్రం రమణయ్య, కె.పోలయ్య,ఎస్.కె,నయీం, సి.హెచ్.సుబ్బారావు,ఎస్. కామేశ్వరరావు,ఓ.వరలక్ష్మి, డి.మనేమ్మ,కే.నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
