శంఖవరం – వేళంగి ఆర్టీసీ బస్సును పునరుద్దరించండి…

  • జిల్లా ప్రజా రవాణా అధికారిని అభ్యర్థించిన చిలుకూరి రామ్ కుమార్.

శంఖవరం/ కాకినాడ మనన్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం నుంచి వేళంగికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును పునరుద్దరించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావును జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షుడు రామ్ కుమార్ చిలుకూరి గురువారం కోరారు. కాకినాడ ఆర్టీసీ కార్యాలయంలో శ్రీనివాసరావును కలిసిన రామ్ కుమార్, పార్టీ నేతల బృందం ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయనతో రామ్ కుమార్ మాట్లాడుతూ… గతంలో సుమారు 10 ఏళ్ళ క్రితం వరకూ తుని, కాకినాడ ఆర్టీసీ డిపోల నుంచి శంఖవరం నుంచి గౌరంపేట, శృంగధార, పెదమల్లాపురం మీదుగా వేంగి గ్రామానికి 19 కిలో మీటర్ల దూరం పొడవునా ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా సేవలను అందించేవని చెప్పారు. అయితే అనంతరం కాలంలో రోడ్డు బాగా ధ్వంసమైన నేపధ్యంలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఈ రోడ్డును ఆర్నెల్ల క్రితం పునర్నిర్మించి నప్పటికీ కూడా ఇంకా బస్సును పునరుద్దరించలేదని రామ్ కుమార్ గుర్తుచేశారు. గిరిజన కు గ్రామాల ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసులను యధావిధిగా పునరుద్ధరించాలని రాంకుమార్ బృందం కోరింది. బస్సులను పునరుద్ధరించడానికి ఉన్న అన్ని అవకాశాలనూ అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు సానుకూలంగా ప్రతిస్పందించారు. ఈ కార్యక్రమంలో రంభాల వెంకటేశ్వరరావు, బొలిశెట్టి రామకృష్ణన్, పెండెం బాబ్జీ, సలాది నాయుడు తదితరులు రాంకుమార్ వెంట ఉన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///