

- *వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు*
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లో లయన్స్ క్లబ్ వారి సేవలకు ప్రతి రూపం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ అని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శిగా ఎన్నికైన లయన్ రెడ్డి నాయుడు, లయన్ గోళ్ళ నాగేశ్వరరావు ను నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ గిరిబాబు శాలువా, పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. గిరిబాబు మాట్లాడుతూ మండలంలో లయన్స్ క్లబ్ ద్వారా పేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు, ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న సేవలు, నిరుపేదలకు చేస్తున్న సేవలు, నూతనంగా ఎన్నికైన సభ్యులు మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ రామిశెట్టి నాని, ముద్రగడ వీరేంద్ర, గుమ్ములూరి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.