

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారానికి నాలుగవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యధా విదంగా సమ్మె కొనసాగించడం జరిగింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వారి విధులను బహిష్కరించి బుధవారం నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్ గ్రేషియా, జీ.ఓ.నెం.36 ప్రకారం వేతనాలు అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. మున్సిపల్ కార్యాలయము ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, మరియు పారిశుద్ధ్య కార్మికులు, ప్రదర్శనగా బయలుదేరి “మున్సిపల్ కార్మికుల – ఐక్యత వర్ధిల్లాలి” “సమాన పనికి – సమాన వేతనo” అమలు వేయాలి, జీ.ఓ. నెంబర్ 36 ప్రకారం జీతాలు వర్తింపజేయాలి, “అధికారులు కార్మికుల పై వేధింపులు ఆపాలి”, అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నుండి గాంధీ బొమ్మ మీదుగా, సంఘం థియేటర్, చందమామ ఐస్క్రీమ్, హాస్పిటల్ రోడ్, పాత బస్టాండ్, ముత్యాల పేట, మీదుగా టవర్ క్లాక్ సెంటర్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కు ప్రదర్శనగా చేరుకొని నిరసన తెలియజేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ సమ్మె శాంతియుతంగా చేస్తున్న కార్మికులపై అధికారులు నాయకుల మెప్పు పొందేందుకు కార్మికులను బెదిరింపులు, ఒత్తిడులు చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని, కార్మికులు వారి హక్కుల కోసం వారు పోరాటాలు నిర్వహిస్తున్నారని, తెలుసుకోవాలన్నారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అమలు చేయాలని చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగాలు కల్పించాలని, సర్వీసు 62 ఏళ్లకు పెంచాలని, నిత్యవసర,వస్తువులు ధరలు రోజు రోజుకీ పెరిగి పోతుండగా గత ఏడు సంవత్సరాల నుండి జీతాలు పెంచకపోవడం, ఒకరి మీద ఒకరు హామీలు ఇవ్వడం వెంటనే ప్రభుత్వాలు మారిపోతుండడంతో కార్మికులు చాలీచాలని జీతాలతో దుర్భర పరిస్థితి ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వెంకటరమణ, గౌరవాధ్యక్షులు జోగి.శివకుమార్, ఎస్.కామేశ్వరరావు, సి.హెచ్. సుబ్బారావు,ఎం.రమణయ్య. ఎస్కే.నయీం, బి.మురళి,గూడూరు మణి,డి. మణమ్మ, కే.నారాయణమ్మ, ఓ. వరలక్ష్మి, సి.ఐ.టి.యు నాయకులు బి.వి.రమణయ్య, పామంజి మణి,అడపాల ప్రసాద్, బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
