పాతకక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో 6గురు నిందితులకు జీవిత కాల జైలు శిక్ష

Mana News :- గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి నవబంర్ 27 :- జోగుళాంబ గద్వాల పోలీస్ :- పాత కక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్ల తో దాడి చేసి హత్య చేసిన కేసులో 6 గురు నిందితులకు జీవిత కాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికీ 3500/- రూపాయాల జరిమానా విధించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టు గౌరవ మేజిస్ట్రేట్ శ్రీ కె కుషా ,నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపిఎస్. గతంతో నిందితులు చేసిన హత్య కేసుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుడు సాక్షులను ముందు ఉండి నడిపిస్తున్నాడు అనే కోపం తో మరల బాధిత కుటుంబ సభ్యుడిని వేట కొడవళ్ల తో నరికి హత్య చేసిన కేసులో 6 గురు నిందితులకు *జీవిత కాలపు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికీ 3500/- రూపాయాల. జరిమాన విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్& సెషన్స్ కోర్టు మేజిస్ట్రేట్ శ్రీ కె.కుషా ఈ రోజు తీర్పును వెల్లడించారు. నేరం సంఖ్య: 17/2016 U/S 147,148,120B,302 r/w149IPC, మానవపాడు పోలీస్ స్టేషన్ . పిర్యాది పని రాజేంద్ర కుమార్ అలియాస్ క్రాంతి s/o పెద్ద కురుమన్న, వయసు -35 సం “లు, కులం – SC, వృత్తి – కరెంట్ సబ్ స్టేషన్ ఆపరేటర్ R/o చెన్నిపాడు గ్రామం, మనవపాడు మండలము అను వ్యక్తి తేది:02.02.2016 నాడు మనోపాడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మా నాన్న అయిన పెద్ద కురుమన్న s/o పని బిసన్న, వయసు -60 సం “లు, అంతకు ముందు గ్రామ సర్పంచ్ గా పని చేశారు. వారు 6 గురు అన్నదమ్ములు అని, మా కుటుంబానికీ గ్రామానికి చెందిన అదే కులాన్ని కి చెందిన వరికుంట్ల ప్రసాద్ కుటుంబానికీ 2012 సం “లో గణేష్ విగ్రహం విషయంలో గొడవలు జరిగాయని,అట్టి గొడవల గురించి పాత కక్షలు మనసులో పెట్టుకొని 2014 సం”లో మార్చి నెలలో మా చిన్నాయన అయిన పని మహేశ్ ను వరికుంట్ల ప్రసాద్ అతని కుటుంబ సభ్యులు కత్తులు , కర్రలతో దాడి చేసి చంపారని, అట్టి కేసు ప్రస్తుతం మహబూబ్ నగర్ కోర్ట్ లో సాక్షుల బయనాలు జరుగుతున్నవి, ఇట్టి కేసులో సాక్షులను రాజీ పడకుండా మా నాయన సాక్షం చెప్పిస్తునందున , మాజి సర్పంచి అయినందున మాకు పెద్ద మనిషి అయి ఇట్టి కేసుల్లో ముందు ఉండి నడిపిస్తున్నాడు అని కక్ష పెంచుకొని మా నాయన ను చంపాలని ఉద్దేశ్యం తో తేది 02.02.2016 రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మా నాయన నీళ్ళు తీసుకొని బహిర్భూమికి పోతుల పాడు రోడ్డు వైపు పోయి రోడ్డు దిగుతుండగా వరి కుంట్ల ప్రసాద్, రాజన్న, గర్క రాజు, రామాంజనేయులు, గంగా రాజు, ప్రవీణ్, ప్రకాష్, విరాట్ రాజ్, వేట కొడవళ్ల తో మెడ మీద, బుజం మీద , చేతి మీద నరికి చంపినారు. అప్పుడు పక్కనే పొలం లో మా చిన్నాయన చిన్న కురుమన్న వారి అరుపులు వినీ పరిగెత్తగా వారందరూ పోతుల పాడు వైపు బైక్ పై వెళ్లారని తనకు పోన్ ద్వారా చెప్పగా తాను 2:00 గంటలకు వచ్చి చూడగా అప్పటికే మా నాయన చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో వారికి కొందరు సహకరించారని కావున పాత కక్షల ను మనసులో పెట్టుకొని మా నాన్నను చంపిన వారి పై చట్టరీత్య చర్య తీసుకోవాలని మనవపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా అప్పటి ఎస్సై భగవంత్ రెడ్డి కేసు నమోదు చెయ్యగా అప్పటి సిఐ పి. వెంకటేశ్వర్లు, ASI అంజయ్య ఇన్వెస్టిగేషన్ చేసి చేసి విచారణ పూర్తి అయ్యాక కోర్టు లో చార్జి షీట్ వెయ్యడం జరిగింది. కోర్టు లో ట్రయల్స్ నడుస్తున్న సమయంలో డి.ఎస్పి సత్యనారాయణ పర్యవేక్షణలో, శాంతి నగర్ సీఐ టాటా బాబు, మనవపాడు ఎస్సై చంద్ర కాంత్ సాక్షులను పకడ్బందీగా బ్రీఫింగ్ చేసి తగిన చర్యలు తిసుకొని నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టగా పూర్వపరాలను విన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్& సెషన్స్ కోర్టు మేజిస్ట్రేట్ శ్రీ కె.కుషా 6 గురు నిందితులకు A1-వరికుంట్ల ప్రసాద్ s/o దుబ్బ సవారన్న,వయసు – 52, A2- వరికుంట్ల రామాంజనేయులు s /o జానన్న, వయసు -23, A3- వరికుంట్ల ప్రకాష్ s/o ప్రసాద్, వయసు – 19, A4-వరికుంట్ల గంగా రాజు s/o జానన్న, వయసు- 20, A5- వరికుంట్ల గర్కా రాజు s/o భిసన్న, వయసు-35 సం”లు, A 6- వరికుంట్ల ప్రవీణ్ s/o రాజన్న, వయసు-18 సం”లు, అందరి వృత్తి – కూలీ) జీవిత కాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికీ 3500/- రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు ఇన్వెస్టిగేషన్ అధికారి సీఐ శ్రీ పి.వెంకటేశ్వర్లు, ఎస్సై భగవoత్ రెడ్డి,ASI అంజయ్య, ప్రస్తుత ఎస్సై చంద్ర కాంత్, సిఐ టాటా బాబు, పిపి లు ఆనంద్, వినోద్ కుమార్ మరియు కోర్టు డ్యూటీ అధికారులు ఎస్సై రషీద్, ఏ . ఎస్సైప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సాయి బాబా, కానిస్టేబుల్ గిరి , ప్రదీప్లను జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు ఐపిఎస్ అభినందించారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి