డ్రమ్ము సీడర్ ద్వారా ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,

మన న్యూస్ పాచిపెంట, జూలై 15:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సాంప్రదాయ పద్ధతిలో వరి నాటే కంటే డ్రం సిడర్ ద్వారా నేరుగా వరి నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని,ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మంగళవారం నాడు మండలం చెరుకుపల్లి గ్రామంలో రైతు యాళ్ళ ఈశ్వరరావు వేసిన డ్రం సీడర్ వరిని పరిశీలించారు.ఈ సందర్భంగా మండలంలో మొట్టమొదటిసారిగా డ్రమ్ము సీడరు వరి విధానాన్ని రైతు ఈశ్వరరావు ఆచరించడం ఎంతో అభినందనీయమని రైతులు ఈ విధానాన్ని పాటిస్తే ఎంతో సమయం తో పాటుగా సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని దిగుబడులు కూడా 10 శాతం పెరుగుతాయని అన్నారు.
డ్రం సీడర్ విధానం : -ఈ విధానంలో వరి నాటుకునే రైతులు ఎకరానికి 8-10 కేజీల విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 గంటలు ఒక గోనెసంచులో కట్టి దానిపై కొద్దిపాటి బరువును ఉంచితే విత్తనం మొలక బయటకు కనిపిస్తుంది. ఇలా మొలకెత్తిన విత్తనాన్ని ముందుగా దమ్ము చేసి బాగా చదును చేసిన పొలంలో డ్రమ్ములో వేసి నాటుకోవాలన్నారు. నాటేటప్పుడు బురద పదును మాత్రమే ఉండేటట్లుగా చూసుకొని పొలం బాగా చదునుగా చేసుకోవాలి. నాటిన ఆరవ రోజున కలుపు మందు ఇసుకలో కలిపి చల్లుకోవాలి లేదా 15 రోజుల తర్వాత కొనోవేడర్ సహాయంతో లేదా కూలీల ద్వారా కలుపు తీయించుకుంటే వేరు వ్యవస్థ వద్ద గాలి సోకి మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు.
డ్రం సిడర్ ఉపయోగాలు:- ఎకరానికి 8 నుండి 10 కిలోల వరి విత్తనం సరిపోతుందని
సాగు ఖర్చులు సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే నాలుగు నుండి ఐదు వేల రూపాయలు ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. మూడు నుండి ఐదు బస్తాల అధిక దిగుబడి వస్తుందన్నారు. సమయం ఎంతో ఆదా అవుతుందని కూలీలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు కేవలం ఇద్దరు మనుషులతో ఒక రోజులో మూడు ఎకరాలు పూర్తి చేయవచ్చు
నీటి వినియోగం బాగా తగ్గుతుందని తెలిపారు.
ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న డ్రమ్స్ సీడర్ వరి విధానాన్ని రైతులు అవలంబిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగమణి వినోద్ మరియు ఏఈఓ గణేష్ పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు