

మన న్యూస్ తవణంపల్లె జులై-15
మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తదనగుణంగా అరగొండ సింగల్ విండో చైర్మన్ గా మండల టిడిపి నాయకులు ఏ రంజిత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డైరెక్టర్లుగా ఏ విజయ్ కుమార్, వెంకటేష్ లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన పాలకవర్గ చైర్మన్ రంజిత్ రెడ్డి డైరెక్టర్లను మండల టిడిపి నాయకులు పైమాగం ఏ రఘుపతి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సింగిల్ విండో అభివృద్ధికి మరియు రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.