

గూడూరు, మన న్యూస్ :- నాట్యం పైన మక్కువతో చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో విశేష ప్రదర్శనలు చేసి అందరి మెప్పు పొంది ఇంకా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అంకితభావంతో కష్టపడి ఇష్టపడి నృత్యాన్ని నేర్చుకుంటున్న ఐదవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి మోచర్ల జాహ్నవి. మనుబోలు మండలం పిడూరు గ్రామానికి చెందిన మోచర్ల శివకుమార్ సుమతి ల కుమార్తె అయిన జాహ్నవి శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం లో గురువు సుష్మిత దగ్గర శిక్షణ తీసుకొని ముందుకు సాగుతోంది. ఇప్పటికే వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలు అయిన శ్రీశైలం నర్రవాడ జొన్నవాడ కలవకుండా గుడి సంఘం నెల్లూరు మనుబోలు లలో నాట్య ప్రదర్శనలు చేసింది. శ్రీకృష్ణ కళాపోషక వారి ఆధ్వర్యంలో రెండుసార్లు నెల్లూరులో కూడా ప్రదర్శించి మన్నలను పొందింది. తల్లిదండ్రులు సహకారంతో చదువుతోపాటుగా నాట్యం మరింతగా నేర్చుకొని భవిష్యత్తులో నాట్యం పైన మొక్క ఉన్న వాళ్ళకి నేర్పిస్తానాని మోచర్ల జాహ్నవి అంటోంది.
