

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం
సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి
మన న్యూస్ సింగరాయకొండ:-
నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య పేర్కొన్నారు. ఆదివారం ఎన్నిక జరిగిన సందర్భంగా తనని మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజల ప్రభుత్వ రక్షణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పని చేసే పోలీస్ సిబ్బంది, కుటుంబాల సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంఘం నాయకులు, సభ్యుల సహకారం తో ప్రభుత్వం నుండి అవసరమైన మేరకు హక్కులు సాధించుకునేందుకు తన వంతు బాధ్యత తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బందికి హక్కుల సాధన తో పాటు బాధ్యతలు నిర్వహించడం ప్రజలకు రక్షణ కల్పించడం కూడా ప్రధానమేనని ఆయన గుర్తు చేశారు. పోలీస్ అధికారుల సంఘం అభివృద్ధి, పటిష్టత కి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని హాజరత్తయ్య పిలుపు ఇచ్చారు.వీధుల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు సంఘం అభివృద్ధి కూడా ప్రధానమేనని ఆయన అన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తన పై పెట్టిన భారాన్ని బాధ్యతగా తీసుకుని సేవలు అందిస్తానని మీడియాకి స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితు పైన సిఐ హాజరత్తయైని పలువురు అభినందించారు.
