

మహేశ్వరం. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్, పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన “గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో పెద్దబావి ఆనంద్ రెడ్డి, మర్రి నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాసరెడ్డి, రామిడి రామిరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.