

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- కష్టాలలో ఉన్న గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి అన్నారు.మండలం లోని నెల్లిపూడి గ్రామంలోని వడ్డీ ఏసుబాబు, మేరీ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబంలో ఈ విషాదకర సంఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబం ఆర్థికంగా క్షీణించడంతో జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి ముందుకి వచ్చారు. శుక్రవారం ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జనసేన పార్టీ ప్రజల మధ్య ఉండేందుకు, వారి కష్టాల్లో తోడుగా ఉండేందుకు ఏర్పడింది. ఏ చిన్న సమస్య అయినా మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించేది మా బాధ్యత అని ఈ కుటుంబానికి మన పార్టీ అండగా ఉంటుంది,” అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిల్లీ పంపరాజు, శివకోటి ప్రసాద్, నొక్కి బాబు, కోరాడ జానుబాబు, మద్దిల బాబి, తలపంటి వీరబాబు, పిర్ల నాని, బొడ్డు రాజా, బెంతుకుర్తి తాతబ్బాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొని తమ సానుభూతిని వ్యక్తం చేశారు.