

మన న్యూస్, తిరుపతి, జులై 12 : ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆవులపాటి బుజ్జి బాబు మాట్లాడారు. తిరుపతిలో నాయి బ్రాహ్మణులు అన్ని విధాలుగా చితికిపోయారని, ఆర్థిక ఎదుగుదల లేక చేతివృత్తి పనితోనే కుటుంబాన్ని భారంగా మోయాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలోని నాయి బ్రాహ్మణులంతా ఏకతాటిగా ఉండేందుకు రాష్ట్ర చరిత్రలో తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగు తోందని చెప్పారు. ఈనెల 22వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూత్ హాస్టల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ లలో ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న నాయి బ్రాహ్మణ సంఘాలకు ఆదర్శంగా ఉండేలా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ ఓటింగ్ లో తిరుపతిలోని బార్బర్ షాపుల యజమానులతో పాటు వర్కర్లు వర్కర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని తెలిపారు. తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ మాట్లాడుతూ ఓటర్లు తప్పనిసరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి మీ ఓటుతో సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నుకోవాలని అభ్యర్థించారు.ఓటింగ్ కు వచ్చే ప్రతి నాయి బ్రాహ్మణ సోదరుడికి గుర్తింపు కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పోటీల్లో ఉన్న అభ్యర్థులు జయ కుమార్, రాఘవ, దాము, శివ కుమార్, శ్రీనివాసులు, గోవిందు పాల్గొన్నారు. ఈ ఎన్నికలకు అబ్జర్వర్లుగా రాష్ట్ర అధ్యక్షులు బుజ్జిబాబు, నగర అధ్యక్షులు సిబ్యాల సుధాకర వ్యవహరించినన్నారు.