

మన న్యూస్, పాచిపెంట,జులై 12:- విజిలెన్స్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం పట్టుబడ్డాయి. రెవెన్యూ శాఖ వివరాలు మేరకు ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ మరియు రెవెన్యూశాఖ అధికార్లు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించు చుండగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం (నవరంగాపూర్) కు పిడిఎస్ బియ్యంతో నిండిన ఏపీ 39యు యు 4289 ప్రయాణిస్తున్న లారీ ను తనిఖీ చేయగా వాహనం నందు దాదాపు 15లక్షల 83వేల 400 రూపాయలు విలువ గల 34వేల 800 కిలోల బరువున్న 700 బస్తాల పిడిఎస్ బియ్యం ను కడుమ గ్రామం నకు చెందినరైస్ మిల్ ఓనర్ గోవింద రావు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణలో పైన పేర్కొన్న పిడిఎస్ బియ్యం కొత్తూరు మండలం కడుమ గ్రామంలోని తెల్ల కార్డు లబ్ధిదారుల నుండి సేకరించిన ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపూర్ నందు అమ్ముతామని లారీ డ్రైవరు తెలియచేసాడు. అంతట విజిలెన్స్ అధికారులు 700 బస్తాల పిడిఎస్ బియ్యం మరియు లారీ ను స్వాధీనం చేసుకుని సిఎస్డిటికి అప్పగించడం జరిగినది.మరియు ఈసీ చట్టం 1955 లో ని 6(ఎ) అండ్ 7(1) సెక్షన్ల కింద గోవింద రావు మరియు మానేపల్లి వెంకటేష్ (వాహన డ్రైవర్) ల పై కేసులు నమోదు చేయమని మరియు అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోమని సిఎస్డిటి కి తెలియచేయడం అయింది.పై తనిఖిలలో విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్టర్ సింహాచలం, సబ్ ఇన్స్పెక్టర్ రామా రావు, పోలీస్ కానిస్టేబుళ్లు పురుషోత్తమ, తిరుపతి రావు మరియు రెవెన్యూ శాఖ అధికారి హేమలత, పాచిపెంట సి ఎస్ డి టీ తదితరులు పాల్గొన్నారు.
