

- వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కిర్లంపూడి లో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత, ఉభయగోదావరి జిల్లాల రీజినల్ వైసీపీ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొంటారని తెలిపారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికే బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా కార్యక్రమంలో పాల్గొని నాయకులకు కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారన్నారు.