

గూడూరు, మన న్యూస్ : తిరుపతి జిల్లా గూడూరులో దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బుధవారం రోజు సి.ఐ.టి.యు ఏ.ఐ.టి.యు.సి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ లు రద్దు చేయాలి – కార్మిక హక్కులు కాపాడాలి, గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలు యధా విధంగా కొనసాగాలని పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం కొనసాగాలని, ఎనిమిది గంటలు పని స్థానంలో 10 అమలను వ్యతిరేకిస్తున్నామని, మహిళలకు నైట్ షిఫ్ట్ నైట్ డ్యూటీలు అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ నినాదాలతో ప్రదర్శగా బయలుదేరి గూడూరు అశోక్ నగర్ లో వాటర్ ట్యాంక్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడ నుండి ప్రదర్శనగా అంగన్వాడి,ఆశా, మున్సిపల్, ఆటో వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం భవన నిర్మాణ సంఘం,ముఠా,హమాలి, కౌలు రైతు సంఘం, వీ.ఆర్.ఏ, కెవిపిఎస్, మరియు సి.ఐ.టి.యు, ఏ.ఐ.టీ.యు.సీ నాయకులు అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో “నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలి – కార్మిక హక్కులు కాపాడాలి” “కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ వినాదాలతో గూడూరు పట్టణం మారు మోగింది. అనంతరం కార్మికులు వివేకానంద రోడ్డు,ముత్యాల పేట పాత బస్టాండ్ కు ప్రదర్శనగా చేరుకొని టవర్ క్లాక్ సెంటర్లో “రాస్తారోకో” నిర్వహించడం జరిగింది. అనంతరం సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా 22 వ సార్వత్రిక సమ్మె పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలి తమ హక్కుల పరిరక్షణకై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించిందని ఆయన తెలియజేశారు.16 డిమాండ్లతో ఈ సార్వత్రిక సమ్మె జరిగిందని, 2022 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ విరమించుకోవాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ.ఐ.టీ.యు.సీ.జిల్లా అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాలు కార్మిక ద్రోహులుగా మారారని, పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో చట్టాలలో మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెతో అయినా ప్రభుత్వాలకు బుద్ధి రావాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి చట్టబద్ధ భద్రత కల్పిస్తూ రోజువారి వేతనం 600 రూపాయలు కు పెంచాలని ఏడాదికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని అర్బన్ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్. ప్రభాకర్, గూడూరు సి.పి.ఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జోగి. శివకుమార్. సి.పి.ఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి.శశి కుమార్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ అధ్యక్షలు పామంజి మణి, సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య,ఎస్.డి.రఫీ, గండికోట మధు,ఏంబేటి.చంద్రయ్య, అంగన్వాడీ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.ఇంద్రావతి బి.ఎస్ ప్రభావతి, ఆశా జిల్లా ఉపాధ్యక్షులు కె.ఉష, జిల్లా కమిటీ సభ్యులు కె.జానకి, కెవిపిఎస్ అడపాల ప్రసాద్, గుర్రం రమణయ్య,ఆర్.శ్రీనివాసులు ఆటో సంఘం నాయకులు రమేష్, వి.భాస్కర్ రెడ్డి,చిన్న మున్సిపల్ సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వెంకటరమణ మనిమ్మ, వీ.ఆర్.ఏ సంఘం, నాయకులు సుబ్బయ్య, శ్రీనివాసులు, ఎస్. ముత్యాలయ్య,నారాయణ, వెంకటయ్య, ఏ.ఐ.టి.యు.సి నాయకులు కుమార్, నారాయణ,రమేష్,సునీల్ భాస్కర్,రాఘవులు, వెంకటకృష్ణ ఏకుబ్, తదితరులు పాల్గొన్నారు.
