నానో ఎరువులతో అధిక ప్రయోజనాలు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూలై 8:- రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వాడుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు తాడూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ రసాయన ఎరువులైన యూరియా డిఏపి పొటాష్ ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డీఏపీలను వినియోగిస్తే ఖర్చు బాగా తగ్గడమే కాకుండా పంటలలో ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని తద్వారా అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. నానో ఎరువులు మిగిలిన రసాయన పురుగు మందులతో కలిపి కూడా వాడుకోవచ్చని డ్రోన్ ద్వారా పిచికారి చేయడానికి అత్యంత అనువైన ఎరువులు అని తెలిపారు,భూమిలో వేసిన బస్తాలతో కూడిన ఎరువులు ముఖ్యంగా యూరియా అనేక రూపాలుగా నష్టపోతుందని భూమిలో వేసిన ఎరువులలో సుమారు 40 శాతం రసాయన ఎరువులు పంటకు అందకుండా వివిధ మార్గాలలో నష్టపోతామని అంతే కాకుండా అధిక మోతాదులో వేసినప్పుడు భూ స్వభావం కూడా దెబ్బతిని పర్యావరణ కాలుష్యం నీటి కాలుష్యం నేల కాలుష్యం ఏర్పడతాయని వీటి స్థానంలో నానో ఎరువులను వినియోగించినట్లయితే ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని నేల స్వభావం కూడా దెబ్బ తినకుండా ఉంటుందని అంతేకాకుండా పురుగులు తెగుళ్లు ఆశించకుండా ఉంటాయని తెలిపారు ముఖ్యంగా వర్షం పడిన తర్వాత భూమిలో వేసే ఎరువు కంటే పిచికారి చేసే ఎరువుల ద్వారా ఫలితాలు అందుతాయని కాబట్టి రైతులు నానో ఎరువులు వాడి అధిక ప్రయోజనాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ ప్రకృతి సేద్య సిఆర్పి తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..