

ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు పదివి రావడానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు గంగాధర నెల్లూరు వైసీపీ ఇన్చార్జులు ఎంసీ విజయానంద రెడ్డి కృపా లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం ఉంచి తనకు మండల పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని అలాగే తన వంతు పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని తెలిపారు.
