

మన న్యూస్, పాచిపెంట,జూలై 5 :- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీ కర్రివలస గ్రామంలో పారిశుధ్యం పనులు చక చక జరుగుతున్నాయి. శనివారం నాడు సర్పంచ్ ప్రతినిధి మర్రి ఉమామహేశ్వరరావు బ్లేడు ట్రాక్టర్ పెట్టి గ్రామ శివారున పేరుకుపోయిన తుప్పలు, డొంకలుతో పాటు చెత్తాచెదారాన్ని తొలగించారు. అంతేకాకుండా కాలువుల్లో పూడుకులు తీయించారు. తీసిన చెదారాన్ని నాడెపుల్లో వేయించారు. గ్రామంలో ప్రజలు పంచాయతీకి సహకరించాలని ఊడ్చిన చెత్తను దూరంగా పారబోయాలని కాలవుల్లో పోయి రాదని హితవు పలికారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.