

గూడూరు ,మన న్యూస్:- గూడూరు రెండో పట్టణంలో ఏర్పాటై ఉన్న కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 7th అడిషనల్ జిల్లా జడ్జి కె.వెంకట నాగ పవన్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…రాజీ మార్గమే రాజ మార్గమని,క్షణికావేశంలో జరిగిన చిన్నచిన్న గొడవల వలన కేసులు పెట్టుకుని,కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలకుల ద్వారా రాజి అయ్యే కేసులను పరిష్కరించుకోవాలని తెలియజేశారు.రాజి కుదుర్చుకునేందుకు వచ్చిన వారి కేసులను పరిశీలించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బివి సులోచన రాణి, బార్ ప్రెసిడెంట్ ఉమాశంకర్,న్యాయవాదులు అరవ పార్వతయ్య, కోటేశ్వరరావు, ఎస్.కె మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
