

మనన్యూస్: ప్రతినిధి నవబంర్ 26 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మండలం జిల్లెడ బండ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల జిల్లా కేంద్రంలో చదువుకోడానికి కళాశాల, పాఠశాలలకు వచ్చే విద్యార్థులు సమయానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నమన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ప్రమాదాలు జరుగుతున్నయన్నారు. పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా వస్తుండడంతో హాజరు శాతం తక్కువ కావడంతో పరీక్షలు రాయడానికి అర్హత కోల్పోతున్నమన్నారు. జిల్లెడ బండ, మర్లపల్లి, సంఘాల గ్రామాలలో ప్రతిరోజు బస్సు ఆపకపోవడంతో విద్యార్థులు ఇంటి బాటకు వెళ్తున్నారు. ఈ దృష్టిని జిల్లా అధికారులు స్పందించి బస్సు సర్వీసు నడపాలని విద్యార్థులు కోరారు.