గ్రామీణులకు చేరువవుతున్న బ్యాంకింగ్ సేవలు …

  • జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ వి ప్రసాద్…

శంఖవరం,జగ్గంపేట మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ వి ప్రసాద్ అన్నారు. జూలై 1వ తేదీ నుంచి మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) స్యాచురేషన్ క్యాంపు కార్యక్రమం, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ఎర్రంపాలెం గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతంగా చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్, యూనియన్ బ్యాంక్ సమన్వయంతో నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా ఎల్డీఎం ప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు అందని వర్గాలకు సేవలు చేరువ చేయడం, ఇప్పటివరకు ఖాతా లేని వారికి కొత్త ఖాతాల ఓపెనింగ్, తేలికపాటి కారణాలతో నిలిచిపోయిన (inactive) అకౌంట్లను తిరిగి యాక్టివ్ చేయడం, పీఎం ఎస్బీవై (PM-SBY), పీఎం జెజెబీవై (PM-JJBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి కేంద్ర ప్రభుత్వ బ్రహ్మ పథకాలపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియ జరగడం వంటి కార్యక్రమాలు అమలయ్యాయి.కాకినాడ జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీల్లో ఈ డిఎఫ్‌ఎస్ క్యాంపులు మూడు నెలల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి గ్రామంలో కనీసం ఒకరోజు ఈ స్యాచురేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు డిఎఫ్‌ఎస్ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులు ద్వారా గ్రామస్తుల బ్యాంకింగ్ అవసరాలపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.అన్ని బ్యాంకుల సహకారంతో ప్రతిరోజూ వివిధ గ్రామాల్లో క్యాంపులు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ క్యాంపులో నాబార్డ్ డి.డి.ఎం వై సోమనాయుడు, యూనియన్ బ్యాంక్ ఎఫ్ఐసి మేనేజర్ విజయలక్ష్మి, ఎఫ్‌ఎల్‌సి మేనేజర్ అప్పారెడ్డి, కాట్రావులపల్లి బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు, ఎర్రంపాలెం గ్రామ సర్పంచ్ ముత్యాల దుర్గారావు, మాజీ సర్పంచ్ ముత్యాల వీరభద్రరావు, CFL కౌన్సిలర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

    మన న్యూస్, సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు మున్సిపాలిటీ పరిధి లో ఇంజనీరింగ్ కార్మికులు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. కానీ మా యొక్క సమస్యలపై సమ్మెపై ఇంతవరకు ప్రభుత్వము గాని మున్సిపల్ అధికారులు గానీ ఇక్కడ…

    13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

    మన న్యూస్ సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ అప్పలనాయుడు స్థానిక విలేకరుల అందించిన సమాచారం మేరకు మంగళవారం పట్టణంలోని ఎరుకల వీధిలో దాసరి సన్యాసిరావు ఇంటి వెనుక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

    13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

    13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

    120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

    120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

    విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

    విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

    ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు

    ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు