

- అభినందనలు తెలిపిన పార్టీ కార్యవర్గ సభ్యులు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు…
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- వెనుకబడిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలంటే రాజకీయంగా పురోగతి సాధించాలని, బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే ఆర్థిక, రాజకీయ, సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందని బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నూతన ఇంచార్జ్ గునపర్తి అపరూప్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహింజి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్‌కుమార్ కాకినాడ జిల్లాలో గల నియోజకవర్గ ఇన్చార్జిలను సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా తుని నియోజకవర్గ ఇన్చార్జ్ తంతట కిరణ్ కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా గునపర్తి అపురూప్, పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ కండవల్లి లోవరాజు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ సాధనాల రాజు, జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు ను పార్టీ అధిష్ఠానం నియమించింది. నియమకంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా గునపర్తి అపురూప్ గ్రామ స్థాయి నుండి దళిత నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, ప్రజాసంఘాల నాయకుడు నుంచి అంచెలంచెలుగా జాతీయపార్టీ అయిన బీఎస్పీలో నియోజకవర్గ స్థాయికి ఎదిగారు.ఈ సందర్భంగా మాయావతి ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యమే రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ నేతృత్వంలో భారీ కసరత్తు చేపడుతూ, కష్టపడే తత్వం, పట్టుదల, ధైర్యం, మంచితనం, పోరాటపటిమ, నాయకత్వలక్షణాలు కలిగిన వారిని అధిష్టానం నియమకం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, బెహన్ మాయావతి భావజాలంతో పనిచేస్తున్న… బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు ఆకర్షితుడై కార్యకర్తగా చేరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో గల బహుజనులను జాగృత పరిచి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా నీలి జెండాను ఎగరవేయడం జరుగుతుందని అధిష్టానం పిలుపు మేరకు అంతకరణ శుద్ధితో పనిచేస్తానని అన్నారు. అనంతరం బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యవర్గం బీఎస్పీ అధ్యక్షులు కొంగు రమేష్, ప్రధాన కార్యదర్శి బత్తిన తాతాజీ, శంఖవరం మండలం అధ్యక్షుడు గునపర్తి రాఘవ తదితర నాయకులు కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, నియోజకవర్గ రిపోర్టర్లు ప్రజలు నూతనంగా నియమకమైన బీఎస్పీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ అపురూప్ కు అభినందనలు తెలిపారు.